హిందీలో “దేవర” పెరుగుతున్న “దేవర” వసూళ్లు

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో చేసిన అవైటెడ్ చిత్రమే “దేవర”. మరి మాస్ లో భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎన్నో అంచనాలు సెట్ చేసుకొని రిలీజ్ కోసం ఎదురు చూస్తూ వచ్చారు. అలా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం రికార్డు ఓపెనింగ్స్ ని అందుకుంది.

దీనితో ఎన్టీఆర్ కెరీర్ లోనే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా అయితే దేవర మరో రికార్డు సెట్ చేసింది. అయితే నార్త్ లో కూడా దేవర సాలిడ్ ఓపెనింగ్స్ ని అందుకున్నట్టుగా ట్రేడ్ వర్గాలు వారు తెలిపారు. కానీ ఇప్పుడు డే 2 కి దేవర మరింత గ్రోత్ ని అందుకున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది.

దీనితో రెండో రోజు మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు ఈ చిత్రం అందుకుంటుంది అని చెప్పొచ్చు. ఆల్రెడీ డే 1 8 కోట్ల మేర వసూళ్లు అందుకోగా మొదటి వీకెండ్ లో దేవర 30 కోట్లు నెట్ వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మొత్తానికి అయితే నార్త్ మార్కెట్ లో కూడా ఎన్టీఆర్ సత్తా చాటుతున్నాడు అని చెప్పాలి.

Exit mobile version