వరుణ్ తేజ్ సినిమాలో క్రేజీ కాంబో..?

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతూ దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ‘మట్కా’ అనే పాన్ ఇండియా మూవీని ఆయన తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దర్శకుడు కరుణ కుమార్ డైరెక్ట్ చేస్తుండగా, పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రానుంది. ఇక ఈ సినిమా పూర్తి కాకముందే, మరో దర్శకుడు మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో ఓ సినిమాను ఓకే చేశాడు ఈ హీరో.

ఇప్పటికే అధికారికంగా అనౌన్స్ అయిన ఈ సినిమా నుంచి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో కమెడియన్ సత్య కూడా ఓ కీ రోల్ ప్లే చేయనున్నాడట. ఇటీవల ‘‘మత్తు వదలరా 2’’ మూవీలో తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి మంచి మార్కులు సంపాదించాడు సత్య.

ఇప్పుడు వరుణ్ తేజ్ సినిమాలోనూ దాదాపు ఇలాంటి పాత్రే ఉంటుందని.. ఇది కూడా ఫుల్ లెంగ్త్ రోల్‌గా మేకర్స్ చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ నవంబర్‌లో స్టార్ట్ కానుందని తెలుస్తోంది. వరుణ్ తేజ్ కెరీర్‌లో 15వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని ఫస్ట్ ప్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయనుంది.

Exit mobile version