Devara: ఆస్ట్రేలియాలో ‘దేవర’ కలెక్షన్స్.. మాసివ్!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతున్నాడు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. తారక్ మరోసారి తన నటవిశ్వరూపంతో విధ్వంసం సృష్టించాడని ‘దేవర’ మూవీని చూసిన వారు కామెంట్ చేస్తున్నారు. ఇక వరల్డ్‌వైడ్‌గా ‘దేవర’ కలెక్షన్స్ సునామీ సృష్టిస్తున్నాయి.

‘దేవర’ మూవీ వరల్డ్‌వైడ్‌గా తొలిరోజే రూ.172 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. కింగ్ ఆఫ్ కలెక్షన్స్ తిరిగొచ్చాడంటూ అభిమానులు తారక్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఓవర్సీస్‌లోనూ ‘దేవర’ స్పీడు మామూలుగా లేదు. ఆస్ట్రేలియాలో ‘దేవర’ మూవీ ఏకంగా 550K డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ వెల్లడించారు.

ఇక ఈ వీకెండ్ ఈ వసూళ్ల సంఖ్య భారీగా పెరిగే ఛాన్స్ ఉందని సినీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ మాస్ యాక్షన్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సాలిడ్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version