సత్యదేవ్ ‘జీబ్రా’ గ్లింప్స్‌కి డేట్ ఫిక్స్


ట్యాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జీబ్రా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ చిత్రాన్ని ఈవ్వర్ కార్తీక్ డైరెక్ట్ చేయగా డాలి ధనంజయ ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేశాయి. అయితే, తాజాగా ఈ సినిమా నుండి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వదిలారు మేకర్స్.

‘జీబ్రా’ చిత్రానికి సంబంధించి ‘ది వరల్డ్ ఆఫ్ జీబ్రా’ వీడియో గ్లింప్స్‌ను సెప్లెంబర్ 30న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో మేకర్స్ రూపొందించారు.

ఈ సినిమాలో సత్యరాజ్, ప్రియా భవాని శంకర్, సునీల్, జెన్నిఫర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 31న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

Exit mobile version