Devara: నార్త్ అమెరికాలో 4 మిలియన్ డాలర్ క్లబ్‌లోకి ‘దేవర’

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ‘దేవర’ దూకుడుకు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూశారో, ఇప్పుడు ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు వారు అంతే ఆతృతగా థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ సినిమాకు తొలిరోజే మంచి టాక్ రావడం దీనికి బలంగా మారింది.

ఇక ఈ సినిమా ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర కూడా తన మ్యానియా చూపిస్తోంది. ప్రీ-సేల్స్‌కే భారీ హైప్ తీసుకొచ్చిన ఈ సినిమా ఇప్పుడు వసూళ్ల పరంగా కూడా భారీ నెంబర్స్‌ను నమోదు చేస్తోంది. నార్త్ అమెరికాలో ‘దేవర’ మూవీ తాజాగా 4 మిలియన్ డాలర్ క్లబ్‌లోకి ఎంటర్ అయ్యింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ సత్తా అంటే ఈమాత్రం ఉంటుందని అభిమానులు గర్వంగా చెబుతున్నారు.

‘దేవర’ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్ట్ చేయగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశాయి. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి అదిరిపోయే మ్యూజిక్ అందించాడు.

Exit mobile version