ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న “సత్యం సుందరం”


ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో తమిళ్ సహా తెలుగులో రిలీజ్ అయ్యిన తమిళ చిత్రం “సత్యం సుందరం” కూడా ఒకటి. టాలెంటెడ్ నటులు కార్తీ, అరవింద స్వామి కలయికలో దర్శకుడు సి ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం అటు తమిళ్ తో పాటుగా తెలుగు ఆడియెన్స్ మనసులు దోచుకుంది. మరి బ్యూటిఫుల్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు థియేటర్స్ లో ఆకట్టుకోగా ఈ సినిమా ఓటిటి పార్ట్నర్ సంబంధించి క్లారిటీ వచ్చేసింది.

ఈ చిత్రం థియేట్రికల్ రన్ తర్వాత అయితే ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాని వీక్షించవచ్చు. తెలుగు సహా తమిళ్ భాషల్లో కూడా నెట్ ఫ్లిక్స్ వారే స్ట్రీమింగ్ కి తీసుకురానున్నారు. మరి ఈ చిత్రానికి గోవింద వసంత బ్యూటిఫుల్ సంగీతాన్ని అందించగా తెలుగులో రీసెంట్ గా “35 చిన్న కథ కాదు” లాంటి అందమైన చిత్రాన్ని అందించిన నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ సురేష్ ప్రొడక్షన్ నుంచి ఈ సినిమా కూడా రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version