అలా చేయడం చాలా కష్టం – ఎన్టీఆర్

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ డ్రామా ‘దేవర’. జాన్వీకపూర్‌ కథానాయిక. సైఫ్ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటించాడు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో భారీ వసూళ్లు రాబడుతుంది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసింది. ప్రస్తుతం సెలవులు కావడంతో కలెక్షన్స్ తగ్గకుండా భారీగానే వచ్చేలా ఉన్నాయి. ఐతే, ‘బియాండ్‌ ఫెస్ట్‌’ కోసం అమెరికాలో పర్యటిస్తున్న ఎన్టీఆర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం చాలా రోజులు నీళ్లలోనే ఉన్నాను. అలాగే, ‘దేవర పార్ట్‌-1’కి కూడా. ఇప్పుడు మీ అందరి నుంచి వచ్చిన స్పందన చూస్తుంటే ‘దేవర పార్ట్‌-2’కు కూడా వాటర్‌ సీక్వెన్స్‌ తప్పేలా లేదు’ అని తారక్ సరదాగా చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ దేవర సినిమాలోని వీఎఫ్‌ఎక్స్‌ గురించి కూడా మాట్లాడుతూ.. ‘ఈ విషయంలో ఎస్‌ఎస్‌ రాజమౌళి ఎంతసేపైనా మాట్లాడతారు. ఒక నటుడిగా అది ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. వీఎఫ్‌ఎక్స్‌ ద్వారా వాటర్‌ క్రియేట్‌ చేసి, అది నిజమైనదిగా కనిపించేలా చేయడం చాలా కష్టం’ అని ఎన్టీఆర్ చెప్పాడు.

Exit mobile version