ఆ హీరోతో శారీరక సంబంధం లేదు.. సింగర్ క్లారిటీ

తమిళ స్టార్ హీరో జయం రవి తన భార్య ఆర్తితో తాను విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటన వచ్చిన దగ్గర నుంచి ఈ విడాకుల వార్త నిత్యం వార్తల్లో నలుగుతూనే ఉంది. ఇందులో భాగంగా ముఖ్యంగా సింగర్ కెనీషాతో జయం రవికి శారీరక సంబంధం ఉందని.. అందుకే, ఆ సింగర్ కోసమే ఆయన తన భార్యకి విడాకులు ఇస్తున్నారని వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సింగర్ కెనీషా పై తమిళ నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ తో విరుచుకు పడ్డారు. ఆమెను ట్రోల్ చేస్తూ బాగా ఇబ్బంది పెట్టారు.

కాగా, తన పై జరుగుతున్న నెగిటివ్ ప్రచారంపై సింగర్ కెనీషా మరోసారి స్పందించింది. ‘జయం రవికి నాకు మధ్య శారీరక సంబంధం లేదు. ఇది నిజం. మా మధ్య ఉన్నది కేవలం వ్యాపారపరమైన సంబంధమే. ఆయన నాకు బిజినెస్ లో సపోర్ట్ చేస్తున్నారు. అన్నిటికి మించి జయం రవి నాకు మంచి మిత్రుడు. అందరూ అనుకుంటున్నట్లు జయం రవి విడాకుల నిర్ణయానికి కారణం నేను కాదు. నా పై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. దయచేసి ఈ వివాదంలోకి నన్ను లాగొద్దు’ అంటూ సింగర్ కెనీషా ఓ ఇంటర్వ్యూలో కోరారు.

జయం రవి మాత్రం తన విడాకుల పై క్లారిటీ ఇస్తూ.. ‘నా భార్య ఆర్తితో విడాకులు తీసుకోవాలనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాను. ఇది మా ఇద్దరి మంచి కోసమే’ అంటూ జయం రవి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

Exit mobile version