Devara: హిందీలో డే 2 అదరగొట్టిన “దేవర”


మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి దేవర పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కి రాగ ఈ చిత్రం మొదటి రోజే వరల్డ్ వైడ్ భారీ రికార్డు వసూళ్లు కొల్లగొట్టి అదరగొట్టింది.

ఇక ఈ సినిమా నార్త్ ఇండియా పెర్ఫామెన్స్ కోసం కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. మరి డే 1 సుమారు 8 కోట్ల మేర అందుకున్న ఈ చిత్రం డే 2 అనుకున్నట్టుగా సాలిడ్ జంప్ అందుకొని మంచి నంబర్స్ ని ఈ చిత్రం నమోదు చేసింది. ఇలా డే 2 అయితే దేవర 9.5 కోట్లు అందుకుంది.

దీనితో మొత్తం రెండు రోజుల్లో దేవర 17.45 కోట్ల నెట్ వసూళ్లు అందుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో వీకెండ్ లో మాత్రం మంచి జంప్ ని అందుకుందని చెప్పాలి. అలాగే ఈ ఆదివారం కూడా దేవర వసూళ్లు ఇదే రీతిలో కొనసాగనున్నట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి వీకెండ్ కి దేవర 30 కోట్ల మార్క్ ని కొడుతుందో లేదో అనేది.

Exit mobile version