మొత్తానికి “గేమ్ ఛేంజర్” పై పెరుగుతున్న హైప్..


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి కూడా మరో హీరోయిన్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారీ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ చిత్రం నుంచి ఇపుడు వస్తున్న ఒకో అప్డేట్ అయితే మంచి హైప్ ని పెంచుకుంటూ వెళుతుంది అని చెప్పాలి.

మెయిన్ గా లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన రెండో సాంగ్ రా మచ్చ మచ్చకి సాలిడ్ రెస్పాన్స్ అన్ని భాషల ఆడియెన్స్ నుంచి వస్తుంది. థమన్ ఇచ్చిన మాస్ బీట్స్ శంకర్ మార్క్ గ్రాండియర్ విజువల్స్ రామ్ చరణ్ గ్రేస్ కి మంచి మార్కులు ఇపుడు దక్కుతున్నాయి. దీనితో నెమ్మదిగా గేమ్ ఛేంజర్ పై మరింత హైప్ పెరుగుతూ వస్తుంది అని చెప్పాలి. మరి మేకర్స్ దీనిని ఇలాగే కాంటీనుఈ చేస్తే బెటర్ అని చెప్పాలి. ఇప్పటికే సినిమా చాలా ఆలస్యం అవుతూ వచ్చింది. మరి చూడాలి గేమ్ ఛేంజర్ రిలీజ్ నాటికి హైప్ ఏ రేంజ్ లో ఉంటుంది అనేది.

Exit mobile version