దుల్కర్ తో బాలయ్య ‘అన్‌ స్టాపబుల్’

బాలయ్య ‘అన్‌ స్టాపబుల్’ టాక్ షో సూపర్ హిట్ అయింది. కాగా, ద‌స‌రా కానుక‌గా బాల‌య్య మూడో సీజన్ కూడా తీసుకురాబోతున్నాడు. అన్‌స్టాప‌బుల్ మొదటి రెండు సీజన్లు భారీ విజ‌యాన్ని అందుకున్నాయి. ఈ క్రమంలోనే మూడో సీజన్ కూడా మంచి విజయాన్ని సాధిస్తోందని అంచనాలు ఉన్నాయి. ఐతే, ఈ టాక్ షో షూటింగ్ గురించి ఓ లేటెస్ట్ అప్ డేట్ తెలుస్తోంది. హీరో దుల్కర్ సల్మాన్ తన ‘లక్కీ భాస్కర్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ‘అన్‌ స్టాపబుల్’ షోకి వచ్చాడు. ఈ రోజే దుల్కర్ సల్మాన్ తో ఎపిసోడ్ ని చిత్రీకరణ చేస్తున్నారు.

ఈ ఎపిసోడ్ లో దుల్కర్ సల్మాన్ తో పాటు దర్శకుడు వెంకీ అట్లూరి.. నిర్మాత నాగవంశీ తదితరులు పాల్గొంటారని తెలుస్తోంది. బాలయ్య వారితో సరదాగా ముచ్చటిస్తున్నారట. ఇంతకీ, బాలకృష్ణ, వీరి నుంచి ఎన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టబోతున్నారో చూడాలి. ఇక లక్కీ భాస్కర్ సినిమా విషయానికి వస్తే.. దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Exit mobile version