ప్రభాస్‌ పంపే భోజనం పై హీరోయిన్ క్రేజీ కామెంట్స్

హీరోయిన్ మాళవికా మోహనన్‌ కి ‘తంగలాన్‌’ సినిమాతో మంచి హిట్ వచ్చింది. ప్రస్తుతం ‘రాజా సాబ్‌’, ‘సర్దార్‌ 2’ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. తాజాగా సోషల్‌ మీడియాలో తనను ఫాలో అయ్యే నెటిజన్లతో ముచ్చటిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ, మాళవికా మోహనన్‌ చెప్పిన సంగతులు ఏమిటంటే.. ‘హైదరాబాద్‌ వచ్చినప్పుడు మీరు ప్రత్యేకంగా తినాలకునే ఫుడ్‌ ఏమిటి ?’ అని ఓ నెటిజన్ అడగగా.. మాళవిక ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ.. హైదరాబాద్‌లో నేను తిన్న అత్యంత రుచికరమైన ఆహారం ప్రభాస్‌ పంపే ఇంటి భోజనం’ అని క్రేజీగా ఆన్సర్ ఇచ్చింది.

ఇంతకీ, మీ ఫేవరెట్‌ ఫుడ్‌ ఏమిటి ? అని మరో నెటిజన్ ప్రశ్నించగా… ‘మా అమ్మ చేతి వంట. బ్రౌన్‌ రైస్‌, చేపల కూర, వేపుడు అంటే నాకు చాలా ఇష్టం’ అంటూ మాళవిక చెప్పుకొచ్చింది. హారర్‌ మూవీ.. ఘోస్ట్‌ పాత్రలో మిమ్మల్ని మేం ఎప్పుడు చూస్తాం ? అని మరో ఫాలోవర్ పోస్ట్ పెట్టగా.. ‘మరీ అంత ప్రత్యేకంగా అడుగుతున్నారు. మీరు నన్ను దెయ్యంలా ఎందుకు చూడాలనుకుంటున్నారు’ అని మాళవికా మోహనన్‌ ఎదురు ప్రశ్నించింది.

Exit mobile version