‘రా మచ్చా మచ్చా’ సాంగ్ వెనుక కథ ఇదే !

‘గేమ్ ఛేంజర్’ నుండి వచ్చిన ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ ప్రోమో రాకింగ్ బీట్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. కాగా, ఈ పాటను రాసిన లిరికిస్ట్ అనంత్ శ్రీరామ్ తో నిర్మాత దిల్ రాజు కాసేపు సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా అనంత్ శ్రీరామ్ ‘మచ్చా మచ్చా’ పాటకు కారణాన్ని, ఆ పాట వెనుక ఉన్న కోణాన్ని చెప్పుకొచ్చారు. దిల్ రాజు మాట్లాడుతూ… ‘రా మచ్చా మచ్చా’ పాటకు ఇచ్చిన ట్యూన్ లోనే మచ్చా మచ్చా ఉంది. చివరగా ఆ పదమే ఫైనల్ అయింది’ అని అన్నారు.

దానికి బదులుగా, అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘ఈ పాట రాయడానికి ముందు దర్శకుడు శంకర్ గారు నాకు చెప్పింది ఏమిటంటే.. మన ఫ్రెండ్ గొప్పవాడైన తర్వాత చాలా కాలం తర్వాత కలిశాక, ఎంత మంచి ఫ్రెండ్ అయినా ఫ్రీగా మాట్లాడలేరు. కొంచెం మొహమాట పడతారు. అమ్మో ఇప్పుడు చాలా పెద్దోడు అయిపోయాడు, మనం ఫ్రీగా మాట్లాడొచ్చా ?, లేదా ? అని డౌట్ పడతారు. కాబట్టి, నేను మీలో ఒకడినే. నేను నీ ఫ్రెండ్ నే అన్న కాన్సెప్ట్ మీద ఈ సాంగ్ రావాలి అని చెప్పారు. ఆ మాటలే ఈ పాట రాయడానికి ప్రేరణ’ అంటూ అనంత్ శ్రీరామ్ చెప్పుకొచ్చారు.

Exit mobile version