Game Changer: ‘రా మచ్చా మచ్చా’ అంటూ రఫ్ఫాడించిన చరణ్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’ కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండగా పూర్తి పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఈ సినిమాలో నుంచి తాజాగా ‘రా మచ్చా మచ్చా’ అనే రెండో లిరికల్ సాంగ్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గతంలో చెప్పినట్లుగానే ఈ పాట ఆద్యంతంత ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ పాటకు మంచి లిరిక్స్‌తో పాటు క్యాచీ ట్యూన్స్ ఉండటంతో ఇది శ్రోతలకు త్వరగా కనెక్ట్ అవుతోంది. ఇక ఈ పాటలో రామ్ చరణ్ ట్రెండీ లుక్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. అంతేగాక, ఆయన వేసే హూక్ స్టెప్స్ కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ పాట ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా నిలుస్తుందని అభిమానులు చెబుతున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక విలక్షణ నటుడు ఎస్.జె.సూర్య ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version