SWAG: ‘శ్వాగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ముహూర్తం ఫిక్స్!

యంగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్వాగ్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు హసిత్ గోలి డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. ఇక ఈ సినిమాలో శ్రీ విష్ణు ఏకంగా 4 విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేశాయి.

అయితే, ఈ సినిమాను అక్టోబర్ 4న గ్రాండ్ రిలీజ్‌కి మేకర్స్ రెడీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను అక్టోబర్ 1న పార్క్ హయత్ హోటల్‌లో సాయంత్రం 6 గంటల నుంచి వైభవంగా నిర్వహిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. కాగా, ఈ ఈవెంట్‌కి గెస్టుగా ఎవరు వస్తున్నారనే అంశాన్ని మేకర్స్ ఇంకా రివీల్ చేయలేదు.

ఇక ఈ సినిమాలో అందాల భామలు రీతూ వర్మ, దక్ష నాగర్కర్, మీరా జాస్మిన్, శరణ్య ప్రదీప్‌లతో పాటు రవిబాబు, గెటప్ శ్రీను, సునీల్, గోపరాజు రమణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యనర్‌పై టిజి.విశ్వప్రసాద్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version