అఫీషియల్: ప్రభాస్ సినిమాలో లెజెండరీ యాక్టర్ కన్ఫమ్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన ‘ది రాజా సాబ్’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తుండగా, హార్రర్ కామెడీ చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా పూర్తికాకముందే, ప్రభాస్ తన నెక్స్ట్ మూవీని దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు.

ఇప్పటికే అఫీషియల్‌గా లాంచ్ అయిన ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను పెట్టేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. కాగా, ఈ సినిమాలో లెజెండరీ యాక్టర్ మిథున్ చక్రబర్తి ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడనే టాక్ గతకొద్ది రోజులుగా సినీ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది. అయితే, తాజాగా ఈ విషయాన్ని అఫీషియల్‌గా మేకర్స్ వెల్లడించారు. తాజాగా మిథున్ చక్రబర్తికి ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయనకు ‘ఫౌజీ’ చిత్ర మేకర్స్ నిర్మాతలు అధికారికంగా శుభాకంక్షలు తెలిపారు. ప్రభాస్-హను టీమ్ ఆయనకు శుభాకాంక్షలు తెలపడంతో పాటు, తాము ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమాలోకి ఆయనకు సాదరంగా స్వాగతం పలుకుతున్నట్లు ట్వీట్ చేశారు.. ఇక ఈ సినిమాలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తోండగా, అలనాటి హీరోయిన్ జయప్రద ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version