ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘కళింగ’

టాలీవుడ్‌లో తెరకెక్కిన హార్రర్ థ్రిల్లర్ మూవీ ‘కళింగ’ ఇటీవల రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ మూవీ మంచి ఎక్స్‌పీరియెన్స్ అందించింది. బాక్సాఫీస్ దగ్గర మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ఈ చిత్రాన్ని త్వరలోనే స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు మేకర్స్ రీసెంట్‌గా ట్వీట్ చేశారు. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీ ప్రీమియర్ డేట్‌ను అనౌన్స్ చేశారు. హార్రర్ థ్రిల్లర్ అంశాలతో ఆహా ప్రేక్షకులను ‘కళింగ’ ఆకట్టుకునేందుకు డేట్ ఫిక్స్ అయ్యిందని.. అక్టోబర్ 4 నుంచి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఆహా వెల్లడించింది.

ఈ సినిమాలో ధృవ వాయు హీరోగా నటించగా ప్రగ్యా నయన్, ఆడుకాలెం నరేన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ధృవ వాయు డైరెక్ట్ చేయగా, అనంత నారాయణన్, విష్ణు శేఖరన్ సంగీతం అందించారు. మరి ‘కళింగ’ మూవీ ఓటీటీ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

Exit mobile version