ఫోటో మూమెంట్: బ్రహ్మానందంతో ఐశ్వర్య సెల్ఫీ.. కూతురు కూడా!

దుబాయ్‌లో IIFA 2024 అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇండియన్ సినీ పరిశ్రమకు చెందిన పలువురు హేమాహేమీలు హాజరయ్యారు. ఇక సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన పలు భాషలకు సంబంధించిన సినిమాలు ఈ అవార్డుల వేడుకలో విజేతలుగా నిలిచాయి.

ఈ క్రమంలో చాలా మంది సెలెబ్రిటీలు ఒకేచోట కనిపించడంతో పండుగ వాతావరణం నెలకొంది. అయతే, ఈ సందర్భంగా బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి ఈ ఈవెంట్‌కి హాజరయ్యింది. కాగా, ఈ సినీ అవార్డ్స్ వేడుకలో టాలీవుడ్ సీనియర్ కమెడియన్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కూడా హాజరుకావడంతో, ఆయనతో కలిసి ఐశ్వర్య ఓ సెల్ఫీ దిగింది.

తన కూతురు ఆరాధ్యతో కలిసి బ్రహ్మానందంతో సెల్ఫీ దిగిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇద్దరు స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version