నైజాంలో “దేవర” లేటెస్ట్ వసూళ్లు డీటెయిల్స్.!

మన టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా “దేవర” హవా పాన్ ఇండియా లెవెల్లో ఎలా నడుస్తుందో చూస్తున్నాం. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం క్రేజీ వసూళ్లతో వరల్డ్ వైడ్ దూసుకెళ్తుంది. ఇక ఈ చిత్రం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వసూళ్లు కొల్లగొడుతుండగా సక్సెస్ ఫుల్ గా 4 రోజుల రన్ ని ఈ చిత్రం అందుకుంది.

మరి ఇలా నాల్గవ రోజు నైజాం మార్కెట్ లో దేవర సాలిడ్ నంబర్స్ ని సెట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి పి ఆర్ నంబర్స్ ప్రకారం చూసినట్టు అయితే దేవర నాల్గవ రోజు 2.3 కోట్ల షేర్ ని అందుకోగా మొత్తం నాలుగు రోజుల్లో 35.38 కోట్ల షేర్ ని ఈ చిత్రం రాబట్టి అదరగొడుతుంది. ఇలా దేవర అయితే సాలిడ్ రన్ తో దూసుకెళ్తుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version