The GOAT: ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న దళపతి “ది గోట్”


ఇళయ దళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి అలాగే స్నేహ హీరోయిన్స్ గా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన రీసెంట్ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం”. మరి విజయ్ కెరీర్ లో 68వ సినిమాగా వచ్చిన ఈ చిత్రం అనుకున్న రేంజ్ టాక్ ని తెచ్చుకోలేదు కానీ విజయ్ స్టార్ పవర్ తో మాత్రం భారీ వసూళ్ళని తాను రాబట్టేసాడు. అయితే ఈ చిత్రం ఇప్పుడు ఫైనల్ గా ఓటిటి రిలీజ్ కి సిద్ధం అయ్యింది.

ఈ సినిమా హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి వీరు లేటెస్ట్ గా ఓ క్లారిటీ అయితే ఇచ్చేసారు. ఈ చిత్రాన్ని వీరు తెలుగు, తమిళ్ సహా హిందీ, కన్నడ మళయాళ భాషల్లో ఈ అక్టోబర్ 3 నుంచి స్ట్రీమింగ్ కి అందుబాటులోకి తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. సో ఇంకో రెండు రోజుల్లో ఈసీ చిత్రం వచ్చేస్తుందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా ఏజిఎస్ సినిమాస్ నిర్మాణం వహించారు. అలాగే ఈ చిత్రానికి పార్ట్ 2 కూడా వెంకట్ ప్రభు చేస్తానని తెలిపాడు.

Exit mobile version