వైరల్ పిక్స్: కూల్ లుక్స్ లో అదరగొట్టిన కింగ్ నాగ్


మన టాలీవుడ్ ఎవర్ ఛార్మింగ్ స్టార్ హీరోస్ లో సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కూడా ఒకరు. మరి తన సినిమా టైటిల్ “మన్మథడు” కి పూర్తి న్యాయం చేస్తూ నాగ్ ఈ ఏజ్ లో కూడా తన ఛార్మింగ్ లుక్స్ తో అదరగొడుతున్నారు. మరి ఇప్పుడు పలు సాలిడ్ ప్రాజెక్ట్ లని నాగ్ చేస్తుండగా ఈ సినిమాలలో ఓ సినిమా నుంచి వచ్చిన లేటెస్ట్ పిక్స్ కొన్ని వైరల్ గా మారాయి.

ధనుష్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “కుబేర” లో నాగార్జున నటిస్తుండగా ఈ సినిమా నుంచి నాగ్ పై వచ్చిన పిక్స్ వైరల్ గా మారాయి. మరి వీటిలో నాగ్ సూపర్ కూల్ గా స్టైలిష్ లుక్స్ లో అదరగొట్టారని చెప్పాలి. దీనితో ఈ ఏజ్ లో కూడా నాగ్ మైంటైన్ చేస్తున్న ఛార్మింగ్ లుక్స్ ని చూసి ఫ్యాన్స్ కూడా స్టన్ అవుతున్నారు. ఇక నాగ్ కుబేర సహా లోకేష్ కనగరాజ్ రజినీకాంత్ కాంబినేషన్ లో చేస్తున్న భారీ చిత్రం “కూలీ” సినిమాలో కూడా కీలక పాత్ర చేస్తున్నారు.

Exit mobile version