Devara: ‘దేవర’లో ఎన్టీఆర్‌కి ఆ విషయంలో వంద మార్కులు!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్‌కి అభిమానులు విజిల్స్ వేస్తూ థియేటర్లలో రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ‘దేవర’కు మిగతా భాషల్లో కూడా మంచి రెస్పాన్స్ దక్కుతోంది.

కాగా ఈ సినిమాకు ఎన్టీఆర్ అన్ని భాషల్లోనూ స్వయంగా డబ్బింగ్ చెప్పాడు. దీంతో ఇతర భాషల అభిమానులు ఎన్టీఆర్ డైలాగ్ డెలివరి, ఆయనకు భాషపై ఉన్న పట్టుని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒక హీరో ఇన్ని భాషల్లో సొంతంగా డైలాగ్ చెప్పి మెప్పించడం నిజంగా గ్రేట్ అని వారు అంటున్నారు.

ఈ కారణంగానే ఎన్టీఆర్ కోసం ‘దేవర’ చిత్రాన్ని ఇతర భాషల్లోనూ ఆదరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో నటించగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించిన ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశాయి.

Exit mobile version