“గేమ్ ఛేంజర్” టీజర్ వచ్చేది ఎప్పుడో ఖరారు..


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మావెరిక్ దర్శకుడు కాంబినేషన్ లో చేస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం ఎప్పటి నుంచో మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఒకొకటి వస్తుండగా రీసెంట్ గానే నిర్మాత దిల్ రాజు అవైటెడ్ టీజర్ ఈ అక్టోబర్ లోనే వస్తుంది అని కన్ఫర్మ్ చేశారు.

మరి ఈ అక్టోబర్ లోనే కానీ ఎప్పుడు అనే ప్రశ్నకి ఇప్పుడు సమాధానం దొరికేసింది. ఈ సినిమా టీజర్ ని ఈ దసరా కానుకగా అందించబోతున్నట్టుగా లేటెస్ట్ గా థమన్ క్లారిటీ ఇచ్చేసాడు. దీనితో గేమ్ ఛేంజర్ అవైటెడ్ టీజర్ దసరా కానుకగా రానుంది అని చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాలో కియార అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తుండగా ఈ డిసెంబర్ 20న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకురాబోతున్నారు.

Exit mobile version