పవన్ నాలెజ్డ్ పై తమిళ ఆడియెన్స్ ప్రశంసలు.!

మన టాలీవుడ్ పవర్ స్టార్ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి కూడా అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇపుడు సినిమాలు సహా తన రాజకీయ పనుల్లో కూడా ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఇలా పవన్ రీసెంట్ గా తమిళ మీడియాకి ఓ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఇంటర్వ్యూ తాలూకా ప్రోమో చూసి పవన్ ఫ్యాన్స్ ఒకింత ఆశ్చర్యపోయారు. ఇన్ని రోజులు సినిమాకే తనని రెస్ట్రిక్ చేసుకున్న పవన్ తమిళ్ అంత అనర్గళంగా మాట్లాడ్డం చూసి స్టన్ అయ్యారు.

అయితే దీనికి మించి ఈ ఇంటర్వ్యూతో తమిళ ఆడియెన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. తమిళ నేల కోసం అక్కడ చాలా అరుదైన విషయాలు కోసం పవన్ మాట్లాడ్డం తమిళ ఆడియెన్స్ ని ఎంతగానో ఇంప్రెస్ చేసింది అంటున్నారు. అలాగే అక్కడ ఇంటర్వ్యూ చేస్తున్న తమిళ యాంకర్ కి కూడా తెలియని పలు అంశాలు పవన్ మాట్లాడ్డం కోలీవుడ్ ఆడియెన్స్ ని మరింత ఆశ్చర్యపరిచింది అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. దీనితో పవన్ పై వారు మరింత రెస్పెక్ట్ పెరిగింది అని అంటున్నారు.

Exit mobile version