Devara: నార్త్ అమెరికాలో తగ్గని ‘దేవర’ దండయాత్ర

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన తీరుకి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా సత్తా చాటుతూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

ఓవర్సీస్‌లోనూ ‘దేవర’ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర కొనసాగిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటివరకు నార్త్ అమెరికాలో ఏకంగా 5.3 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు వీకెండ్‌లో మాత్రమే కాకుండా వీక్ డేస్‌లోనూ సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయని బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి.

మాస్ పాత్రలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్‌కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు ప్రొడ్యూస్ చేశాయి.

Exit mobile version