ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “ది గోట్”

ఇళయ దళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోగా స్నేహ మరో హీరోయిన్ గా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన భారీ చిత్రమే “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం”. మరి విజయ్ కెరీర్ లో తక్కువ అంచనాలు తోనే వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్ ని కూడా అందుకోలేదు. అయినప్పటికీ భారీ వసూళ్లు సాధించి విజయ్ తన స్టార్డం ని చూపించాడు. అయితే ఈ సినిమా ఫైనల్ గా ఓటిటిలో రిలీజ్ కి వచ్చేసింది.

తెలుగులో సహా ఒరిజినల్ తమిళ్ మరియు ఇతర పాన్ ఇండియా భాషల్లో అయితే ఈ సినిమా నేటి నుంచి ఓటిటి ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చేసింది. ఈ చిత్రాన్ని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా ఇందులో ఈ సినిమా ఈరోజు నుంచి స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ చిత్రాన్ని చూడాలి అనుకునేవారు నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా ఏజిఎస్ సినిమాస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

Exit mobile version