నైజాంలో సాలిడ్ జంప్ అందుకున్న “దేవర”.. డే 6 వసూళ్లు ఇవే

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన స్టామినాతో బాక్సాఫీస్ దగ్గర లాక్కొస్తున్న భారీ చిత్రమే “దేవర”. మంచి హైప్ నడుమ వచ్చిన ఈ చిత్రం యూనానిమస్ పాజిటివ్ టాక్ ని తెచ్చుకోకపోయినప్పటికీ వరల్డ్ వైడ్ రికార్డు వసూళ్లు కొల్లగొడుతుంది. మరి ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం వీక్ డేస్ లోకి వచ్చాక కూడా దుమ్ము లేపుతుంది. మరి నిన్న గాంధీ జయంతి హాలిడే దేవరకి బాగా వర్కౌట్ అయ్యినట్టుగా తెలుస్తుంది.

ఇలా ఆరవ రోజు సాలిడ్ జంప్ ని దేవర తీసుకోగా నైజాం మార్కెట్ లో లేటెస్ట్ వసూళ్లు తెలుస్తున్నాయి. మరి 5వ రోజు దేవర 2.37 కోట్ల షేర్ ని అందుకుంటే 6వ రోజు 3.71 కోట్ల షేర్ ని అందుకుంది. దీనితో నిన్న ఒక్క రోజే కోటిన్నర మేర ఎక్స్ట్రా షేర్ ని దేవర రాబట్టింది అని చెప్పాలి. దీనితో మొత్తం 6 రోజుల్లో దేవర 41.46 కోట్ల షేర్ మార్క్ ని అందుకొని దూసుకెళ్తుంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version