‘మట్కా’ టీజర్‌కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మట్కా’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు కరుణ కుమార్ ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా రానున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. కాగా, ఇప్పుడు ఈ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.

ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను అక్టోబర్ 5న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ మూవీగా మేకర్స్ తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో అందాల భామలు మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జి.వి.ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డా.విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 14న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

Exit mobile version