‘విశ్వం’ నుండి మరో అప్డేట్.. ‘వస్తాను వస్తానులే’ సాంగ్‌కి ముహూర్తం ఫిక్స్!

మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆస్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో మంచి మార్కులు దక్కించుకున్నాయి.

ఇక ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేస్తుండటంతో, చిత్ర ప్రమోషన్స్‌ను మేకర్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఈ మూవీ నుండి మూడో సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు వారు సిద్ధమయ్యారు. ‘‘వస్తాను వస్తానులే..’’ అంటూ సాగే ఓ రొమాంటిక్ సాంగ్‌ను ‘విశ్వం’ మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సాంగ్‌ని అక్టోబర్ 4న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిత్ తాజాగా వెల్లడించింది.

ఈ సినిమాలో అందాల భామ కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, చేతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాను టిజి.విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తుండగా, అక్టోబర్ 11న గ్రాండ్ రిలీజ్‌కి రెడీ చేస్తున్నారు.

Exit mobile version