మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో మనం చూస్తున్నాం. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేయడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాకు భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఓవర్సీస్లోనూ ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర దూకుడు చూపెడుతూ వసూళ్ల వర్షం కురిపిస్తున్నాడు.
ముఖ్యంగా నార్త్ అమెరికాలో ‘దేవర’ ర్యాంపేజ్ బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ఈ సినిమా అక్కడ 5 మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ఎంటర్ అవగా, తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఏకంగా 5.5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసినట్లుగా బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి. తారక్ వన్ మ్యాన్ షోకి అభిమానులు ఫిదా కావడంతోనే ఇలాంటి వసూళ్లు వస్తున్నాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా, సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశాయి.