Devara: ‘దేవర’ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఇక రచ్చ రచ్చే!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అయ్యింది. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులు పట్టం కడుతున్నారు.

ఈ సినిమాకు కళ్లు చెదిరే వసూళ్లు రాబడుతూ సత్తా చాటుతోంది. ఇక ఈ సినిమా రిలీజ్‌కి ముందు ‘దావూదీ’ సాంగ్‌ని రిలీజ్ చేయగా, ఇది ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇక ఈ పాటను బిగ్ స్క్రీన్‌పై చూడాలని అభిమానులు ఎంతో ఆశగా థియేటర్లకు వెళ్తే, సినిమాలో ఎక్కడా ఈ పాట లేకపోవడంతో వారు నిరాశగా వెనుదిరిగారు.

అయితే, ఇప్పుడు అభిమానుల కోరిక మేరకు ‘దావూదీ’ సాంగ్‌ను రేపటి(అక్టోబర్ 4) నుంచి థియేటర్లలో ప్లే అవుతుందని చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. దీంతో అభిమానులు ఈ పాటను థియేటర్లలో చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఈ పాటలో జాన్వీ కపూర్, ఎన్టీఆర్‌ల డ్యాన్స్ స్టెప్పులు ఖచ్చితంగా అభిమానులను అలరిస్తాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version