సమీక్ష : స్వాగ్ – రొటీన్ ఫన్ తో సాగే శ్వాగణిక వంశ డ్రామా !

Swag Movie Review in Telugu

విడుదల తేదీ : అక్టోబర్ 04, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : శ్రీ విష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నగార్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవి బాబు, గెటప్ శ్రీను మరియు గోపరాజు రమణ తదితరులు

దర్శకుడు : హసిత్ గోలి

నిర్మాతలు : టీజీ విశ్వప్రసాద్

సంగీత దర్శకుడు : వివేక్ సాగర్

సినిమాటోగ్రఫీ : వేదరామన్ శంకరన్

ఎడిటర్ : విప్లవ్ నైషదం

సంబంధిత లింక్స్: ట్రైలర్

యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ మూవీ ‘స్వాగ్’. ఈ సినిమాను దర్శకుడు హసిత్ గోలి డైరెక్ట్ చేయగా, పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఈ రోజు రిలీజ్ అయ్యింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

శ్వాగణిక వంశానికి చెందిన రాజు కుటుంబానికి చెందిన వారసత్వానికి సంబంధించి ఈ కథ సాగుతుంది. పోలీస్ ఆఫీసర్ భవభూతి (శ్రీ విష్ణు) అనుబంధం లేని ఓ మొరటి మనిషి. తనను వదిలి వెళ్లిపోయిన భార్యనే తలుచుకుంటూ రాక్షసంగా బతుకుతూ ఉంటాడు. మరోవైపు అనుభూతి (రీతూ వర్మ) ఆడవారి అస్తిత్వం కోసం పట్టుదలగా ఉంటుంది. ఆడవారి పెత్తనమే ఉండాలనేది ఆమె అభిమతం. ఈ మధ్యలో సింగ (యంగ్ శ్రీ విష్ణు) కథ ఏమిటి ?, రీల్స్ చేస్తూ వ్యూస్ కోసం అతను పడిన పాట్లు ఏమిటి ?, తండ్రి ఎవరో తెలియని అతని జీవితంలోకి ఈ శ్వాగణిక వంశం ఎలా వచ్చింది ?, సింగ తల్లి రేవతి (మీరా జాస్మిన్) పాత్ర ఏమిటి ?, ఈ మొత్తం కథలో శ్వాగణిక వంశానికి చెందిన వారసుడు ఎవరు ?, ఆ వారసత్వం కోసం ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు ?, చివరకు వారసుడు దొరికాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

శ్వాగణిక వంశానికి చెందిన ‘రాజు’ ఫ్యామిలీ కథ దగ్గర నుంచి, పోలీస్ ఆఫీసర్ భవభూతి సోలో ట్రాక్ తో పాటు సింగ లవ్ స్టోరీ వరకూ చాలా పాత్రల మధ్య నడిచిన ఈ డ్రామాలో కొన్ని ఫన్ ఎలిమెంట్స్ బాగున్నాయి. మొత్తానికి ఎంటర్టైనింగ్ మోడ్ లో సాగిన ఈ ఫిల్మ్ లో గుడ్ మెసేజ్ తో పాటు కొన్ని బరువైన ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా శ్రీవిష్ణు చేసిన ఐదు పాత్రలు మరియు వాటి చిత్రీకరణ అలాగే ఆయా పాత్రల గెటప్స్ అండ్ సెటప్ బాగున్నాయి. పైగా, సినిమాలో శ్వాగణిక వంశానికి చెందిన థీమ్ కూడా బాగుంది.

అన్నిటికీ కంటే ముఖ్యంగా శ్రీవిష్ణు సినీ కెరీర్ లో ఈ సినిమా చాలా కొత్తగా ఉంది. శ్రీవిష్ణు ఈ సినిమాలో తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు చక్కగా నటించి మెప్పించాడు. హీరోయిన్ గా నటించిన రీతూ వర్మ చక్కగా నటించింది. మరో కీలక పాత్రలో నటించిన గోపరాజు రమణ తన నటనతో ఆకట్టుకున్నాడు. మీరా జాస్మిన్ పాత్రకి పెద్దగా స్కోప్ లేదు. అయితే, ఉన్నంతలో ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. రవి బాబు నటన కూడా సహజంగా ఉంది. దక్ష నగార్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, గెటప్ శ్రీను అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

ఈ స్వాగ్ కథా నేపథ్యం, అలాగే నటీనటుల పనితీరు బాగున్నా.. కథనం విషయంలో మాత్రం దర్శకుడు హసిత్ గోలి ఇంట్రెస్ట్ కలిగించ లేకపోయారు. ముఖ్యంగా శ్వాగణిక వంశానికి చెందిన వారసత్వం చుట్టూ సాగే డ్రామాలో రిపీటెడ్ సీన్స్ ఎక్కువైపోయాయి. దీనికితోడు సెకండ్ హాఫ్ లో పాత్రల మధ్య కాన్ ఫ్లిక్ట్స్, ఎమోషన్స్ కూడా వర్కౌట్ కాలేదు. ఇల్లాజికల్ పాయింట్ చుట్టూ ఫేక్ ఎమోషన్స్ తో స్క్రీన్ ప్లే సాగడంతో స్వాగ్ చిత్రం కొన్ని చోట్ల నిరాశ పరిచింది.

పైగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే శ్వాగణిక వంశానికి చెందిన రాజు ట్రాక్ అలాగే, పోలీస్ ఆఫీసర్ భవభూతి ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే మెయిన్ సీన్స్ కూడా మెలో డ్రామాలా అనిపిస్తాయి. దీనికి తోడు, పాత్రలు ఎక్కువ అవ్వడం, అలాగే అక్కడక్కడా కామెడీ కోసం పెట్టిన అమవసరమైన డిస్కషన్ కూడా బాగాలేదు. ప్రధానంగా కొన్ని లీడ్ సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. మొత్తానికి కథలో చెప్పాలనుకున్న మెసేజ్ కూడా రొటీన్ గానే సాగింది. మొత్తమ్మీద దర్శకుడు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఈ స్వాగ్ చిత్రాన్ని మలచలేకపోయారు.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. ముందే చెప్పుకున్నట్లు దర్శకుడు హసిత్ గోలి టేకింగ్ బాగుంది. అయితే, మంచి కంటెంట్ రాసుకోవడంలో విఫలం అయ్యారు. ఆయన రాసిన స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా లేదు. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అందించిన సంగీతం పర్వాలేదు. ఐతే సెకండ్ హాఫ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని కీలక సన్నివేశాల్లో ఆకట్టుకునేలా లేదు. వేదరామన్ శంకరన్ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఇక ఎడిటర్ విప్లవ్ నైషదం ఎడిటింగ్ వర్క్ కూడా పర్వాలేదు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

 

తీర్పు :

‘స్వాగ్’ అంటూ వచ్చిన ఈ శ్వాగణిక వంశానికి చెందిన వారసత్వం కథలో.. స్టైలిష్ మేకింగ్, కొన్ని ఫన్ మూమెంట్స్ అండ్ కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అలాగే శ్రీవిష్ణు – మిగిలిన నటీనటుల నటన సినిమాకి ప్లస్ అయ్యాయి. కానీ, ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ డ్రామా మిస్ కావడం, కొన్ని చోట్ల స్లో నేరేషన్, మరియు బోరింగ్ సీన్స్, రెగ్యులర్ అండ్ రిపీటెడ్ సన్నివేశాలు, ముఖ్యంగా ఆసక్తికరంగా సాగని పాత్రలు వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ ‘స్వాగ్’ సినిమాలో కొన్ని ఫన్ ఎలిమెంట్స్ మాత్రమే కనెక్ట్ అవుతాయి.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version