రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఆలియా భట్ స్పై థ్రిల్లర్ ‘ఆల్ఫా’

బాలీవుడ్‌లో యశ్ రాజ్ స్పై యూనివర్స్‌కి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈ బ్యానర్ నుంచి వచ్చే సినిమాల కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. ఇక ఇప్పుడు ఈ సంస్థ నుంచి ఓ లేడీ స్పై థ్రిల్లర్ మూవీ కూడా రానున్నట్లు అనౌన్స్ చేశారు. స్టార్ హీరోయిన్ ఆలియా భట్, శర్వారి లీడ్ రోల్స్‌లో ‘ఆల్ఫా’ అనే టైటిల్‌తో లేడీ స్పై థ్రిల్లర్ తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో యాక్షన్ డోస్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ‘ఆల్ఫా’ చిత్ర రిలీజ్ డేట్‌ను మేకర్స్ కన్ఫమ్ చేశారు. ‘ఆల్ఫా’ చిత్రాన్ని 2025 క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఇక ఈ సినిమాను శివ్ రావైల్ డైరెక్ట్ చేస్తుండగా, ఆదిత్య చోప్రా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాని అత్యంత భారీ బడ్జెట్‌తో మేకర్స్ తెరకెక్కిస్తున్నారు.

Exit mobile version