Devara: యూఎస్ లో “దేవర” లేటెస్ట్ వసూళ్లు.!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ అలాగే సైఫ్ అలీఖాన్ లు టాలీవుడ్ డెబ్యూ ఇస్తూ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ చిత్రమే “దేవర”. మరి టాలీవుడ్ నుంచి చాలా కాలం తర్వాత వచ్చిన పాన్ ఇండియా సినిమా ఇది కాగా భారీ వసూళ్లు అయితే దేవర అందుకుంది. ఇలా మొదటి వారం రన్ ని ఈ చిత్రం పూర్తి చేసుకోగా యూఎస్ మార్కెట్ లో కూడా సాలిడ్ వసూళ్లతో దేవర దూసుకెళ్తుంది.

ఇలా ప్రస్తుతం దేవర అయితే 5.6 మిలియన్ డాలర్స్ గ్రాస్ మార్క్ ని చేరుకొని నెక్స్ట్ స్టాప్ గా 6 మిలియన్ దిశగా వెళుతుంది. ఇక ఈ వీకెండ్ లో అయితే దేవర వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. మరి చూడాలి దేవర నార్త్ అమెరికాలో ఎక్కడ ఆగుతుంది అనేది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.

Exit mobile version