‘వేట్టయన్’ సినిమాలో ఇండియా బిగ్గెస్ట్ స్కామ్..?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వేట్టయన్’ మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను దర్శకుడు జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా పూర్తి కాప్ యాక్షన్ థ్రిల్లర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కించింది. ఈ సినిమాలో రజినీకాంత్ ఓ పవర్‌ఫుల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా కనిపించబోతున్నాడు.

అయితే, ఈ సినిమా కథకు సంబంధించి తాజాగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘వేట్టయన్’ సినిమా కథ ఇండియాలో జరిగిన భారీ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ స్కామ్ ఆధారంగా తెరకెక్కినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, అభిరామి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. మరి నిజంగానే ‘వేట్టయన్’ మూవీ కథ ఎడ్యుకేషన్ స్కామ్‌పై నడుస్తుందా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version