ప్రభాస్ ‘స్పిరిట్’ మెగాస్టార్.. నిజమేనా ?

గ్లోబల్ స్టార్ ప్రభాస్ స్టార్ లైనప్‌లో భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఉన్న ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే రూమర్ వినిపిస్తోంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే, స్టార్ జంట సైఫ్ అలీఖాన్ – కరీనా కపూర్ స్పిరిట్ లో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మమ్ముట్టి పేరు కూడా వినిపిస్తోంది. ఐతే, టీమ్ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

కాగా ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానుంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్‌’ సినిమా రాబోతుంది. ‘స్పిరిట్‌’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుందని టాక్. అలాగే, సందీప్ రెడ్డి వంగా మార్క్ యాక్షన్ సీన్స్ అండ్ వైల్డ్ ఎలిమెంట్స్ సినిమాలో ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది. దాదాపు రూ.400 కోట్లకు పైగా బడ్జెట్‌ తో ఈ సినిమా తెరకెక్కనుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించాయి.

Exit mobile version