నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ !

టాలెంటెడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం తన ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘స్వయంభూ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఐతే, నిఖిల్ కొత్త సినిమా ముచ్చట గురించి కూడా మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న నిఖిల్ కొత్త చిత్రానికి ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా వెల్లడిస్తూ వదిలిన పోస్టర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

అన్నట్టు ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్‌ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్‌లో ఆమెకు ఈ సినిమా అరంగేట్రం కావడం విశేషం. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరోహీరోయిన్ల లుక్స్ తో పాటు వారి మధ్య కెమిస్ట్రీని కూడా బాగా ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు. కాగా ఈ చిత్రాన్ని ఈ దీపావళికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఈ పోస్టర్ తో క్లారిటీ ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version