Devara: రెండో వారాంతంలో దంచి కొడుతున్న “దేవర”

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ అవైటెడ్ భారీ చిత్రమే “దేవర”. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూడగా వారి అంచనాలు ఈ సినిమా అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి రికార్డు వసూళ్లు సాధించింది. సోలోగా ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా ఈ చిత్రం నిలిచింది. ఇక సినిమా రెండో వీకెండ్ లో కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు అందుకుంటున్నట్టు తెలుస్తుంది.

ఇక ఈ వారాంతం ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని చోట్ల హౌస్ ఫుల్ రన్ తో దేవర దూసుకెళ్తుంది. అలాగే ఈ ఒక్క రోజే ఈజీగా లక్షకి పైగా బుకింగ్స్ నమోదు అయ్యినట్టు కూడా తెలుస్తుంది. అంతే కాకుండా పలు చోట్ల డిమాండ్ మేర ఎక్స్ట్రా స్క్రీన్స్ ని కూడా యాడ్ చేస్తున్నారట. ఇలా రెండో వీకండ్ పూర్తయ్యేసరికి దేవర మంచి అక్యుపెన్సీ లను అందుకుందని చెప్పాలి. ఇక రేపటి నుంచి టికెట్ ధరలు కూడా తగ్గనున్నాయి. మరి ఇది ఎంతమేర ప్లస్ కానుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version