గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర ‘దేవర’ వీరవిహారం

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం స్పీడు తగ్గించకుండా తన సత్తా చాటుతున్నాడు. ఈ చిత్రానికి ఆల్ ఏరియాస్‌లో ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కడంతో ఈ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేస్తోంది. ‘దేవర’ దండయాత్రం మొదలై పది రోజులు పూర్తయినా, కలెక్షన్ల వర్షం మాత్రం కురుస్తూనే ఉంది.

గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర ‘దేవర’ ర్యాంపేజ్ చూసి అభిమానులతో పాటు సినీ క్రిటిక్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమా పది రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.466 కోట్లుకు పైగా వసూళ్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక దసరా వరకు మేజర్ సినిమాలేవీ లేకపోవడంతో, దేవర తన ర్యాంపేజ్ కొనసాగిస్తాడని అందరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్ డ్యుయెల్ రోల్ చేసిన ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. అనిరుధ్ సంగీతం హైలైట్ అయిన ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు ప్రొడ్యూస్ చేయగా.. కొరటాల శివ ఈ చిత్రాన్ని ప్రెస్టీజియస్‌గా డైరెక్ట్ చేశాడు.

Exit mobile version