లేటెస్ట్: ప్రశాంత్ వర్మ నుంచి సాలిడ్ అప్డేట్.!

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుల్లో తన మొదటి సినిమాతోనే సత్తా చాటిన యంగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా ఒకరు. మరి ప్రశాంత్ వర్మ మన తెలుగు సినిమలో మొదటి సూపర్ హీరో సినిమా చేసి సెన్సేషనల్ సక్సెస్ ని అందుకొని పాన్ ఇండియా దర్శకుడు అయ్యిపోయాడు.

మరి ఇక్కడ నుంచి మరిన్ని భారీ సినిమాలు తాను చేస్తుండగా ఇప్పుడు నటసింహం బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ్య తేజని ఇండస్ట్రీకి తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి పరిచయం చేయబోతున్నాడు. అయితే తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి సాలిడ్ అప్డేట్ ని తాను అందించాడు.

ఈ దేవి నవరాత్రుల సమయంలోనే ఈ అక్టోబర్ 10న తన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మూడో సినిమాని అనౌన్స్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసాడు. మరి ఆ సినిమా ఏంటి అనేది ఆరోజు తెలియనుంది. ప్రస్తుతం అయితే జై హనుమాన్, మోక్షజ్ఞ్య సినిమాలతో తాను బిజీగా ఉన్నాడు.

Exit mobile version