పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తుండగా, హార్రర్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ డార్లింగ్ లుక్స్‌లో కనిపిస్తుండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఉన్నారు.
కాగా, నేడు దర్శకుడు మారుతి పుట్టినరోజు సందర్భంగా ‘ది రాజా సాబ్’ మేకర్స్ ఓ స్పెషల్ వీడియో రూపంలో ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపారు. ‘ది రాజా సాబ్’ చిత్రానికి సంబంధించిన స్పెషల్ మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో దర్శకుడు మారుతి ఈ చిత్రం కోసం ఎంతలా కష్టపడుతున్నారో మనకు చూపెట్టారు. ఇక ఈ వీడియోతో అభిమానులు సర్ప్రైజ్ అయ్యారు.
త్వరలోనే ‘ది రాజా సాబ్’ చిత్రం నుండి మరిన్ని అప్డేట్స్ ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు. ఈ సినిమాలో అందాల భామలు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.