NBK109: సస్పెన్స్ వీడేది ఎప్పుడు?

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇప్పుడు తన కెరీర్ లో 109వ చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ కొల్లి తో చేస్తున్న సంగతి తెలిసిందే. మరి భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ అయితే ప్లాన్ ప్రకారం జరిగిపోతుంది కానీ ఈ సినిమా అప్డేట్స్ విషయంలో అభిమానులు మాత్రం కొంచెం డిజప్పాయింట్ గానే ఉన్నారని చెప్పాలి.

సినిమా నుంచి అరకొర అప్డేట్స్ మాట పక్కన పెడితే.. ఇది కాకుండా సినిమా టైటిల్ ఏంటి అనేది ఇంకా రివీల్ చెయ్యకుండా ఉండడం అనేది బాలయ్య అభిమానుల్లో మరింత సస్పెన్స్ గా మారింది. అయితే ఇది వరకే పలు సందర్భాల్లో రిలీజ్ చేసే ప్లాన్ చేసినట్టు టాక్ వచ్చింది కానీ కుదరలేదు.

దీనితో అసలు ఈ సినిమా టైటిల్ ఎప్పుడు వస్తుంది అనేది ఫ్యాన్స్ లో మరింత సస్పెన్స్ గా మారింది. మరి ఈ దసరా కానుకగా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఆరోజున సినిమా అప్డేట్ ఏమన్నా వస్తుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా నాగవంశీ, త్రివిక్రమ్ లు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version