టాలీవుడ్‌లో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేసే నారా రోహిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సుందరకాండ’ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు వెంకటేశ్ నిమ్మలపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలతో తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది. ఇక ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన కంటెంట్ ప్రేక్షకుల్లో అంచనాలను క్రియేట్ చేశాయి.
తాజాగా ఈ సినిమా నుండి ‘హమ్మయ్య’ అనే లిరికల్ సాంగ్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాట ఆద్యంతం ఆకట్టుకునే విధంగా కంపోజ్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్. ఇక శ్రీహర్ష ఈమని అందించిన చక్కటి లిరిక్స్‌కి రామ్ మిర్యాల తన వాయిస్‌తో మ్యాజిక్ చేశాడు. ఈ పాట ఆకట్టుకునే విధంగా ఉండటంతో అభిమానుల్లో ఈ సినిమాపై మరింత పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి.
ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రీదేవి విజయ్ కుమార్ చాలా చక్కటి లుక్స్‌తో కనిపిస్తుండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. విర్తి వాఘని మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నరేష్, వాసుకి, సత్య తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.