‘హను మాన్’ యూనివర్స్ నుంచి “మహా కాళీ”.. ప్రశాంత్ వర్మ అప్డేట్


మన టాలీవుడ్ లో మొదటి సూపర్ హీరో చిత్రం “హను మాన్” కోసం అందరికీ తెలిసిందే. మరి యంగ్ హీరో తేజ సజ్జతో దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ కాగా ఈ సినిమా తర్వాత తన నుంచి మరిన్ని భారీ చిత్రాలు వస్తాయని కన్ఫర్మ్ చేశారు. అలా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మూడో సినిమాని నేడు ఈ దేవి నవరాత్రుల సమయంలో అనౌన్స్ చేశారు.

మరి అనుకున్నట్టుగానే తన నుంచి ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా వస్తున్నట్టుగా టాక్ వచ్చింది. మరి నేడు అనుకున్నట్టుగానే “మహా కాళీ” అనే సినిమాని తన హను మాన్ యూనివర్స్ కి అనుసంధానం చేస్తూ రివీల్ చేశారు. మరి దీనిపై వదలిన అనౌన్సమెంట్ వీడియో కూడా ఇంట్రెస్టింగ్ గా అంచనాలు పెంచే విధంగా ఉంది. అలాగే ఈ చిత్రాన్ని లేడీ దర్శకురాలు పూజా కొల్లూరు వర్క్ చేయనుండగా రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మాణం వహిస్తున్నారు. మరి ఈ సినిమాపై మరిన్ని డీటెయిల్స్ మున్ముందు రానున్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version