ఇంటర్వ్యూ: గోపీచంద్ – ఈ పండగకి ‘విశ్వం’ పర్ఫెక్ట్ సినిమా

ఈ దసరా కానుకగా రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మ్యాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న లేటెస్ట్ చిత్రం ‘విశ్వం’. కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో గోపీచంద్ ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు. మరి అవేంటో చూద్దాం.

 

శ్రీను వైట్ల గారు ఈ కథ చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి?

శ్రీనువైట్ల గారితో సినిమా చేయాలని చాలా బ్యాక్ అనుకున్నాం. గతంలో ఓ రెండు లైన్స్ చెప్పారు. అవి బావున్నాయి కానీ నాకు సరిపోవనిపిస్తుందని చెప్పాను. తర్వాత ‘విశ్వం’ కథ లైన్ గా చెప్పారు. పాయింట్, గ్రాఫ్ గా చాలా బావుంది. ఇందులో అన్నీ చక్కగా కుదురుతాయనిపించింది. తర్వాత అన్నీ తన స్టయిల్ కి తగ్గట్టుగా చేసుకోవడానికి ఆయన ఏడు నెలలు సమయం తీసుకొని విశ్వం కథని ఫాం చేరు. ఇందులో కంప్లీట్ గా శ్రీనువైట్ల గారి మార్క్ తో పాటు యాక్షన్ ఫన్, కామెడీ అన్నీ పెర్ఫెక్ట్ గా వున్నాయి.

 

ఇందులో ట్రైన్ ఎపిసోడ్ హైలెట్ గా వుంటుందని విన్నాం?

శ్రీను వైట్ల గారి వెంకీ సినిమాలో పాపులర్ ట్రైన్ ఎపిసోడ్ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఆయన నుంచి మరో ట్రైన్ ఎపిసోడ్ వస్తుందంటే కంపారిజన్ ఉంటుంది. అయితే అది వేరే జోనర్, ఇది వేరే జోనర్. అయితే ఈ కంపేరిజన్ కి విశ్వం ట్రైన్ సీక్వెన్స్ రీచ్ అవుతుంది. ఎంటర్టైన్మెంట్ చాలా అద్భుతంగా వచ్చింది. వెన్నెల కిషోర్, వీటి గణేష్, నరేష్ గారు, ప్రగతి గారు.. ఇలా అందరూ చాలా అద్భుతంగా చేశారు. ట్రైన్ సీక్వెన్స్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు చిన్న టెన్షన్ కూడా రన్ అవుతుంది. అది చాలా బాగుంటుంది.

శ్రీను వైట్ల గారిలో నేచురల్ గానే ఒక సెటైరికల్ కామెడీ ఉంటుంది.

 

విశ్వం టైటిల్ కోసం చెప్పండి?

ఇందులో నా క్యారెక్టర్ పేరు విశ్వం. అయితే రెండు అక్షరాలు ఉన్న టైటిల్ నా సెంటిమెంట్ అనుకుంటారేమో అని శ్రీను వైట్ల గారికి చెప్పాను. అయితే ఈ సినిమాకి ‘విశ్వం’ టైటిల్ యాప్ట్ అని ఆయన చెప్పారు.

 

ఇది శ్రీను వైట్ల గారి కం బ్యాక్ ఫిల్మ్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు కదా ?

సినిమా చూసే చెప్పాను. సినిమా చాలా బాగా వచ్చింది. అందుకే అంత కాన్ఫిడెంట్ గా చెప్పాను. డెఫినెట్ శ్రీనువైట్ల గారి పర్ఫెక్ట్ మార్క్ ఇందులో కనిపిస్తుంది. ఆయన మార్క్ పంచస్ వుంటాయి.

 

హీరోయిన్ కావ్య థాపర్ గురించి చెప్పండి

ఇందులో చాలా మంచి క్యారెక్టర్ చేసింది. హీరోతో ట్రావెల్ అయ్యే క్యారెక్టర్. చాలా బాగా చేసింది.

 

మీ నిర్మాతల గురించి చెప్పండి?

ప్రొడ్యూసర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రావడం సినిమాకి మరింత ప్లస్ అయింది. అవుట్ పుట్ చాలా బావొచ్చింది.

 

మ్యూజిక్ కోసం చెప్పండి

చేతన్ భారద్వాజ్ సౌండింగ్ చాలా బావుంది. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బీజీఎం కూడా అదరగొట్టాడు.

 

ఒక్క సెకన్ కూడా బోర్ కొట్టదని చెప్పారు?
సినిమా చాలా బావుంది. చూసినంతసేపు నవ్వుతూనే వుంటారు. థియేటర్ లో రెండున్న గంటల పాటు ఆడియన్స్ హిలేరియస్ గా ఎంటర్ టైన్ చేసే సినిమా ఇది. విశ్వం పర్ఫెక్ట్ పండగ సినిమా. వెరీ క్లీన్ గా వుంటుంది. ఫ్యామిలీ అంతా కలసి హాయిగా నవ్వుకోవచ్చు.

 

చాలా మంది ప్రభాస్, మీ కాంబినేషన్ లో సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు? యూవీలో కూడా సినిమా చేస్తున్నారట?

మాకు చేయాలనే వుంది. కానీ అన్నీ సెట్ కావాలి. కుదిరినప్పుడు తప్పకుండా చేస్తాం. యూవీలో స్టోరీ డిస్కషన్ జరుగుతుంది త్వరలో చెప్తాను.

Exit mobile version