వివాహం చేసుకుంటున్న జంటతో ‘లగ్గం’ ట్రైలర్ లాంచ్

సినిమా ప్రమోషన్స్ కొత్తగా చెయ్యాలి.. బజ్ క్రియేట్ చెయ్యాలి.. ప్రేక్షకుల్లోకి సినిమా తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో డిఫరెంట్ ఐడియాలతో ముందుకొస్తున్నారు “లగ్గం” టీమ్. రెగ్యులర్‌గా సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోస్, లేక టాప్ ప్రొడ్యూసర్‌తో టీజర్, ట్రైలర్స్ లాంచ్ చేయించడం అనేది మనం కామన్. కానీ వీటన్నింటినీ దాటి ఇప్పటివరకు ఎవరూ చేయని విధంగా తమ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టింది ‘లగ్గం’ సినిమా టీమ్. సినిమా మొదలుకొని పాటలు, పోస్టర్స్, టీజర్ అంటూ వరుసగా రోజు ప్రేక్షకులను పలకరిస్తూ “రీల్ పెట్టు – చీర పట్టు” అనే డిఫెరెంట్ కాన్సెప్ట్‌తో ప్రమోషన్స్ మొదలు పెట్టి దూసుకుపోతుంది. ఒక వైపు ‘లగ్గం’ ట్రావెలర్ ఊరూరా తిరుగుతూ లగ్గం గిఫ్ట్స్ అందిస్తూ అందరికీ చేరువ అవుతుంది. అదే తరహాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం మరో కొత్త ఐడియాతో ముందుకు వచ్చింది టీమ్.

‘లగ్గం’ సినిమా ట్రైలర్‌ని నిజజీవితంలో లగ్గం చేసుకుంటున్న నూతన వధూవరులతో లాంచ్ చేయించారు. ఇంజాపూర్ SPR శ్రీరస్తు కన్వెన్షన్‌లో జరిగిన ఒక వివాహ వేడుకలో ‘లగ్గం’ సినిమా టీమ్ అంతా పాల్గొని వధూవరులు గోవర్ధన్-అనూషల చేత మండపంలోనే ‘లగ్గం’ సినిమా ట్రైలర్‌ని లాంచ్ చేశారు. లగ్గం టీమ్ ఇచ్చిన సర్ప్రైజ్‌కి ఆ లాగ్గానికి వచ్చిన ప్రతీ ఒక్కరు ఆశ్చర్య పోవడమే కాక వెరైటీ సినిమా ప్రమోషన్ చూసి అభినందించారు. ఇది లైఫ్ లాంగ్ మాకు గుర్తుండి పోయే లగ్గం అని వధూవరులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో సినిమా దర్శకుడు రమేష్ చెప్పాల, చిత్ర నిర్మాత సుభిషి ఎంటర్టైనమెంట్స్ అధినేత వేణుగోపాల్ రెడ్డితో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

Exit mobile version