మాస్ బీట్స్‌తో ఆకట్టుకుంటున్న ‘గుంగురు గుంగురు’ సాంగ్

మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వం’ రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీను వైట్ల ప్రెస్టీజియస్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాయి. తాజాగా ఈ సినిమాలోని మాస్ సాంగ్ ‘గుంగురు గుంగురు’ని రిలీజ్ చేశారు.

ఈ పాట పూర్తి మాస్ బీట్స్‌తో ఆకట్టుకునే లిరక్స్‌తో ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్‌కి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ కంపోజ్ చేయడం విశేషం. ఇక ఆయనే స్వయంగా ఈ పాటను పాడారు. ఈ పాటలో గోపీచంద్, కావ్య థాపర్‌లు అదిరిపోయే స్టెప్పులతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఈ పాటపై చిత్ర యూనిట్ పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

‘విశ్వం’ సినిమాలో జిషు సేన్‌గుప్తా, నరేష్, సునీల్, ప్రగతి, కిక్ శ్యామ్, విటివి గణేశ్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్‌తో పాటు వేణు దొనెపూడి ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ సినిమాకు ప్రేక్షకులు థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version