NTR: ‘వార్-2’లో ఎన్టీఆర్ షూట్ చేసేది ముగింపేనా..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చూస్తూ దూసుకెళ్తున్న ‘దేవర’లో ఎన్టీఆర్ తన యాక్షన్‌తో ప్రేక్షకులను థియేటర్లకు క్యూ కట్టేలా చేశాడు. ఇక ఈ సినిమా అందుకున్న భారీ సక్సెస్‌తో ఎన్టీఆర్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు.

బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ స్పై యూనివర్స్ సీక్వెల్ మూవీ ‘వార్-2’లో ఎన్టీఆర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో పాటు తారక్‌ను కలిసి బిగ్ స్క్రీన్‌పై చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యశ్ రాజ్ స్పై యూనివర్స్‌లో ‘వార్-2’ మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అయితే, ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా, నెక్స్ట్ షెడ్యూల్‌కి రెడీ అవుతోంది. అయితే, ఈ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్‌ని ఈ షెడ్యూల్‌లో షూట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఎన్టీఆర్-హృతిక్‌ల మధ్య జరిగే ఈ క్లైమాక్స్ సినిమాలో నెక్స్ట్ లెవెల్‌లో ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. నవంబర్‌లో ఈ క్లైమాక్స్ షూట్ చేయనున్నారు. ఇక అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తు్న్నారు.

Exit mobile version