‘విశ్వంభర’ సెట్స్‌లో సందడి చేసిన వెంకటేశ్ అండ్ టీమ్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తుండగా, ఇందులో చిరు ఓ సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నాడు. ఇక రీసెంట్‌గా ఈ చిత్ర షూటింగ్‌కి కొంత బ్రేక్ ఇచ్చిన చిరు, తిరిగి షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు.

కాగా, చిరంజీవి అండ్ టీమ్‌ని మరో స్టార్ హీరో వెంకటేశ్ తన టీమ్‌తో కలిసి ‘విశ్వంభర’ సెట్స్‌లో కలిశాడు. దర్శకుడు అనిల్ రావిపూడితో ముచ్చటగా మూడోసారి సినిమా చేస్తున్న వెంకటేశ్, ఈ చిత్రాన్ని ‘వెంకీ-అనిల్03’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

అయితే, నేడు ‘విశ్వంభర’ సెట్స్‌లో హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. చిరుతో పాటు దర్శకుడు వశిష్ఠతో వారు కొంతసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక దసరా కానుకగా ‘విశ్వంభర’ టీజర్ రేపు రిలీజ్ కానుంది.

Exit mobile version