బాలయ్య-బోయపాటి మూవీకి ముహూర్తం ఫిక్స్ అయ్యిందా..?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం NBK109 మూవీలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత బాలయ్య తన నెక్స్ట్ మూవీని మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో చేయబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. దీంతో వీరిద్దరి కాంబోలో తెరకెక్కబోయే సినిమాపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి.

ఇక ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రానున్న సినిమాపై దసరా సందర్భంగా ఏదైనా అప్డేట్ ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, తాజాగా ఈ విషయంపై సోషల్ మీడియాలో మరో వార్త చక్కర్లు కొడుతోంది. బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో రాబోయే నాలుగో సినిమాను అక్టోబర్ 16న అధికారికంగా పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టబోతున్నారట.

అయితే, దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే ఏదీ రాలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ వార్తను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఇక BB4 అనే హ్యాష్‌ట్యాగ్‌ను వారు ట్రెండ్ చేస్తున్నారు.

Exit mobile version